Posts

Thapsigargin Covid Treatment, New Medicine For Corona Virus

Image
  కరోనాకు కొత్త మందు!  కోవిడ్‌–19 చికిత్సకు మరో కొత్త మార్గం అందుబాటులోకి వచ్చింది. థాప్సీగార్గిన్ ‌ అనే యాంటీ వైరల్‌ డ్రగ్‌ కోవిడ్‌–19 వైరస్‌పై సమర్థంగా పని చేయగలదని బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ నాటింగ్‌హామ్‌ శాస్త్రవేత్తలు గుర్తించారు. సాధారణ జలుబు, రెస్పిరేటరీ సిన్సీషియల్‌ వైరస్, ఇన్‌ఫ్లుయెంజా–‘ఎ’వైరస్‌లపై ఈ మందు ప్రభావం చూపగలదు. ఊపిరితిత్తుల సమస్యలు సృష్టించే కరోనా, ఇతర వైరస్‌లపై ఒకేసారి సమర్థంగా పనిచేసే మందు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో నాటింగ్‌హామ్‌ యూనివర్సిటీతో పాటు చైనా వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని యానిమల్‌ అండ్‌ ప్లాంట్‌ హెల్త్‌ ఏజెన్సీ, ఇంగ్లండ్‌లోని పిర్‌బ్రైట్‌ ఇన్‌స్టిట్యూట్‌లు సంయుక్తంగా పరిశోధనలు చేపట్టాయి.

Budget 2021 Effect On Petrol And Diesel Cost, Today Petrol Price In Hyderabad

Image
బడ్జెట్‌ తర్వాత పెట్రో సెగ షురూ 2021 బడ్జెట్‌ అనంతరం దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడికి మళ్లీ షాకిస్తున్నాయి. బడ్జెట్‌లో ఇంధనంపై అగ్రి సెస్సు విధించిన నేపథ్యంలో పెట్రోల ధరలపై చర్చనీయాంశమైంది. దీనిపై స్పందించిన  ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ అగ్రి సెస్‌ ప్రభావం  వినియోగదారుల మీద ఉండదని స్పష్టం చేశారు.  కానీ  గురువారం రోజు పెట్రోల్ ధర 35 పైసలు పెరిగింది. ఈ  పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో  లీటర్ పెట్రోల్ ధర రూ. 86.65కు చేరింది. డీజిల్ ధర రూ. 76.83కు చేరింది.  ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.93.20 పైసలకు చేరింది. లీటర్ డీజిల్ ధర రూ.83.67 పైసలుగాఉంది. Click Here To Know The Today diesel and petrol price in hyderabad 

5 New Corona Strain Cases Recorded In India | Total 25 New Corona Strain Cases In India

Image
  దేశంలో 25కు చేరిన యూకే స్ట్రెయిన్‌ కేసులు భారత్‌లో కొత్తరకం  కరోనా  క్రమక్రమంగా విస్తరిస్తోంది. దేశంలో తాజాగా మరో ఐదుగురికి యూకే స్ట్రెయిన్‌ కరోనా వైరస్‌ సోకింది. పూణేలో నలుగురికి , ఢిల్లీలో ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో భారత్‌లో మొత్తంగా యూకే స్ట్రెయిన్‌ కరోనా కేసుల సంఖ్య 25కు చేరింది. బాధితులందరినీ ప్రత్యేక అబ్జర్వేషన్లో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ గురువారం ప్రకటన విడుదల చేసింది. కాగా మంగళవారం 6, బుధవారం 14 కరోనా కొత్తరకం కేసులు బయటపడిన విషయం తెలిసిందే ఇదిలా ఉండగా.. భారత్‌లో కొత్తగా 21,821 కోవిడ్‌-19 కేసులు వెలుగుచూశాయి. 299 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో దేశంలో మొత్తంగా కోవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 10,266,674కు చేరగా, కరోనా మరణాల సంఖ్య 148,738గా నమోదైంది.

6 Cases Of New Covid Strain Found In India | UK Returnees Test Positive In India

Image
  భారత్‌లో యూకే స్ట్రెయిన్‌ కలకలం.. ఆరుగురికి పాజిటివ్‌ భారత్‌లో యూకే కొత్తరకం స్ట్రెయిన్‌  కరోనా వైరస్ ‌ కలకలం రేపుతోంది. కోవిడ్‌-19 పరీక్షలో భాగంగా ఆరుగురికి ఈ వైరస్‌ సోకినట్లు నిర్దారణ అయ్యింది. కాగా గత నెల రోజులలో యూకే నుంచి 33 వేల మంది ప్రయాణికులు ఇండియాకు వచ్చారు. వీరిలో 114 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. బెంగళూరులో ముగ్గురు, హైదరాబాద్‌లో ఇద్దరు, పూణేలో ఒకరికి కొత్తరకం కరోనా స్ట్రెయిన్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ ఆరుగురిని ప్రత్యేక గదిలో ఉంచి కేంద్ర వైద్య బృందం పరీక్ష పరీక్షలు నిర్వహిస్తోంది. వీరితో సన్నిహితంగా మెలిగిన వారందరినీ ప్రభుత్వం క్వారంటైన్‌కు తరలించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం ప్రకటన విడుదల చేసింది.

Hyderabad Top In Chicken Dishes Varieties

Image
  సిటీ టేస్ట్‌.. చికెన్‌ ఫస్ట్‌..   చికెన్‌ లవర్స్ ‌కు హైదరాబాద్‌ అడ్డాగా మారుతోంది. టిఫిన్‌.. లంచ్‌.. స్నాక్స్‌.. డిన్నర్‌ సమయం ఏదైనా.. చికెన్‌  వంటకాలను కుమ్మేస్తున్నారు. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత నవంబర్, డిసెంబర్‌ నెలలో చికెన్‌ వాడకంలో దేశంలోనే హైదరాబాద్‌ నగరం మొదటి స్థానంలో ఉంది.గ్రేటర్‌ జనానికి  సందర్భం ఎదైనా ముక్క లేనిదే ముద్ద దిగడంలేదు. దేశరాజధాని ఢిల్లీ రెండో స్థానంలో.. ఎలక్ట్రానిక్‌ సిటీ బెంగళూరు మూడోస్థానంలో నిలవడం విశేషం. కాగా పోషక విలువలు, ప్రొటీన్స్‌  అధికంగా ఉండటం.. అన్ని ఆదాయ వర్గాల వారికీ అందుబాటులో ఉండటంతో చికెన్‌కు రోజురోజుకూ గిరాకీ పెరుగుతోందని పౌల్ట్రీ వ్యాపారులు చెబుతున్నారు. కరోనా తర్వారా చికెన్‌ విక్రయాలు భారీగా పెరిగినా.. మటన్‌ వినియోగం మాత్రం అంతగా పెరగలేదని నాన్‌వెజ్‌ మార్కెట్‌ వర్గాల లెక్కలు చెబుతున్నాయి.   చికెన్‌ వెరైటీల్లోనూ హైదరా‘బాద్‌షా’.. ఉద్యోగం, వ్యాపారం, ఇతర వ్యాపకాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతోన్న సిటీజన్లు ఆన్‌లైన్‌లోనూ తమకు నచ్చిన చికెన్‌ వెరైటీలను ఆర్డర్లు చేస్తున్నట్లు పలు ఫుడ్‌ డెలివరీ సంస్థల సర్వే ద్వారా తెలిసింది. దేశంలోని ఇతర నగరాలతో పోలీ

Telangana CM KCR Adopted Daughter Pratyusha Wedding Photos | KCR Adopted Daughter Marriage

Image
  కేసీఆర్‌ దత్త పుత్రిక ప్రత్యూష వివాహ వేడుక

Bigg Boss Contestant Sohel Takes Up Green India Challenge | Sohel Green India Challenge Pics

Image
  అఖిల్‌కు ఛాలెంజ్‌ విసిరిన సోహైల్‌ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్  ప్రారంబించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా బిగ్ బాస్ 4 విజేత  అభిజిత్  ఇచ్చిన ఛాలెంజ్‌ను రెండో రన్నరప్‌ సోహైల్‌ స్వీకరించాడు. ఈ  మేరకు జూబ్లీహిల్స్‌లోని పార్క్‌లో సోహైల్‌ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా  సోహైల్  మాట్లాడుతూ.. ప్రకృతి మనకు చాలా ఆనందాన్ని ఇస్తుందన్నారు. అలసిపోయి వచ్చిన పచ్చని చెట్టు కింద కూర్చుని పచ్చడి మెతుకులు వేసుకొని తింటే ఆ ఆనందమే వేరు ఉంటుందని పేర్కొన్నారు. మనం ఇప్పుడు మంచి నీటిని డబ్బులు ఇచ్చి కోనుకుంటున్నామని, రాబోయే రోజుల్లో ఆక్సిజన్ కొనుక్కొనే పరిస్థితి రాకుడదంటే బాధ్యతగా మనం అందరం మొక్కలు నాటాలని సోహైల్‌ కోరారు దయచేసి నన్ను అభిమానించే అందరూ మొక్కలు నాటి ఎంపీ సంతోష్ కుమార్, నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో ట్యాగ్ చేయగలరు అని పిలుపునిచ్చారు. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టి పచ్చదనం పెంచడం కోసం కృషి చేస్తున్న రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా తను మరో ముగ్గురికి( అరియానా, మెహబూబ్, అఖిల్) గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు  ఈ సందర్భంగా స