Posts

Showing posts from December, 2020

5 New Corona Strain Cases Recorded In India | Total 25 New Corona Strain Cases In India

Image
  దేశంలో 25కు చేరిన యూకే స్ట్రెయిన్‌ కేసులు భారత్‌లో కొత్తరకం  కరోనా  క్రమక్రమంగా విస్తరిస్తోంది. దేశంలో తాజాగా మరో ఐదుగురికి యూకే స్ట్రెయిన్‌ కరోనా వైరస్‌ సోకింది. పూణేలో నలుగురికి , ఢిల్లీలో ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో భారత్‌లో మొత్తంగా యూకే స్ట్రెయిన్‌ కరోనా కేసుల సంఖ్య 25కు చేరింది. బాధితులందరినీ ప్రత్యేక అబ్జర్వేషన్లో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ గురువారం ప్రకటన విడుదల చేసింది. కాగా మంగళవారం 6, బుధవారం 14 కరోనా కొత్తరకం కేసులు బయటపడిన విషయం తెలిసిందే ఇదిలా ఉండగా.. భారత్‌లో కొత్తగా 21,821 కోవిడ్‌-19 కేసులు వెలుగుచూశాయి. 299 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో దేశంలో మొత్తంగా కోవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 10,266,674కు చేరగా, కరోనా మరణాల సంఖ్య 148,738గా నమోదైంది.

6 Cases Of New Covid Strain Found In India | UK Returnees Test Positive In India

Image
  భారత్‌లో యూకే స్ట్రెయిన్‌ కలకలం.. ఆరుగురికి పాజిటివ్‌ భారత్‌లో యూకే కొత్తరకం స్ట్రెయిన్‌  కరోనా వైరస్ ‌ కలకలం రేపుతోంది. కోవిడ్‌-19 పరీక్షలో భాగంగా ఆరుగురికి ఈ వైరస్‌ సోకినట్లు నిర్దారణ అయ్యింది. కాగా గత నెల రోజులలో యూకే నుంచి 33 వేల మంది ప్రయాణికులు ఇండియాకు వచ్చారు. వీరిలో 114 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. బెంగళూరులో ముగ్గురు, హైదరాబాద్‌లో ఇద్దరు, పూణేలో ఒకరికి కొత్తరకం కరోనా స్ట్రెయిన్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ ఆరుగురిని ప్రత్యేక గదిలో ఉంచి కేంద్ర వైద్య బృందం పరీక్ష పరీక్షలు నిర్వహిస్తోంది. వీరితో సన్నిహితంగా మెలిగిన వారందరినీ ప్రభుత్వం క్వారంటైన్‌కు తరలించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం ప్రకటన విడుదల చేసింది.

Hyderabad Top In Chicken Dishes Varieties

Image
  సిటీ టేస్ట్‌.. చికెన్‌ ఫస్ట్‌..   చికెన్‌ లవర్స్ ‌కు హైదరాబాద్‌ అడ్డాగా మారుతోంది. టిఫిన్‌.. లంచ్‌.. స్నాక్స్‌.. డిన్నర్‌ సమయం ఏదైనా.. చికెన్‌  వంటకాలను కుమ్మేస్తున్నారు. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత నవంబర్, డిసెంబర్‌ నెలలో చికెన్‌ వాడకంలో దేశంలోనే హైదరాబాద్‌ నగరం మొదటి స్థానంలో ఉంది.గ్రేటర్‌ జనానికి  సందర్భం ఎదైనా ముక్క లేనిదే ముద్ద దిగడంలేదు. దేశరాజధాని ఢిల్లీ రెండో స్థానంలో.. ఎలక్ట్రానిక్‌ సిటీ బెంగళూరు మూడోస్థానంలో నిలవడం విశేషం. కాగా పోషక విలువలు, ప్రొటీన్స్‌  అధికంగా ఉండటం.. అన్ని ఆదాయ వర్గాల వారికీ అందుబాటులో ఉండటంతో చికెన్‌కు రోజురోజుకూ గిరాకీ పెరుగుతోందని పౌల్ట్రీ వ్యాపారులు చెబుతున్నారు. కరోనా తర్వారా చికెన్‌ విక్రయాలు భారీగా పెరిగినా.. మటన్‌ వినియోగం మాత్రం అంతగా పెరగలేదని నాన్‌వెజ్‌ మార్కెట్‌ వర్గాల లెక్కలు చెబుతున్నాయి.   చికెన్‌ వెరైటీల్లోనూ హైదరా‘బాద్‌షా’.. ఉద్యోగం, వ్యాపారం, ఇతర వ్యాపకాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతోన్న సిటీజన్లు ఆన్‌లైన్‌లోనూ తమకు నచ్చిన చికెన్‌ వెరైటీలను ఆర్డర్లు చేస్తున్నట్లు పలు ఫుడ్‌ డెలివరీ సంస్థల సర్వే ద్వారా తెలిసింది. దేశంలోని ఇతర నగరాలతో పోలీ

Telangana CM KCR Adopted Daughter Pratyusha Wedding Photos | KCR Adopted Daughter Marriage

Image
  కేసీఆర్‌ దత్త పుత్రిక ప్రత్యూష వివాహ వేడుక

Bigg Boss Contestant Sohel Takes Up Green India Challenge | Sohel Green India Challenge Pics

Image
  అఖిల్‌కు ఛాలెంజ్‌ విసిరిన సోహైల్‌ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్  ప్రారంబించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా బిగ్ బాస్ 4 విజేత  అభిజిత్  ఇచ్చిన ఛాలెంజ్‌ను రెండో రన్నరప్‌ సోహైల్‌ స్వీకరించాడు. ఈ  మేరకు జూబ్లీహిల్స్‌లోని పార్క్‌లో సోహైల్‌ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా  సోహైల్  మాట్లాడుతూ.. ప్రకృతి మనకు చాలా ఆనందాన్ని ఇస్తుందన్నారు. అలసిపోయి వచ్చిన పచ్చని చెట్టు కింద కూర్చుని పచ్చడి మెతుకులు వేసుకొని తింటే ఆ ఆనందమే వేరు ఉంటుందని పేర్కొన్నారు. మనం ఇప్పుడు మంచి నీటిని డబ్బులు ఇచ్చి కోనుకుంటున్నామని, రాబోయే రోజుల్లో ఆక్సిజన్ కొనుక్కొనే పరిస్థితి రాకుడదంటే బాధ్యతగా మనం అందరం మొక్కలు నాటాలని సోహైల్‌ కోరారు దయచేసి నన్ను అభిమానించే అందరూ మొక్కలు నాటి ఎంపీ సంతోష్ కుమార్, నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో ట్యాగ్ చేయగలరు అని పిలుపునిచ్చారు. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టి పచ్చదనం పెంచడం కోసం కృషి చేస్తున్న రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా తను మరో ముగ్గురికి( అరియానా, మెహబూబ్, అఖిల్) గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు  ఈ సందర్భంగా స

Nani's Shyam Singha Roy Movie shooting Starts In Hyderabad | Shyam Singha Roy Movie Update

Image
  హైదరాబాద్‌ శ్యామ్‌ సింగరాయ్ షూటింగ్‌ ట్యాక్సివాలా ఫేం రాహుల్‌ సంక్షిర్త్యన్‌ దర్శకత్వంలో  నాని   హీరోగా తెరకెక్కుతున్న ‘శ్యామ్‌ సింగరాయ్’‌ మూవీ షూటింగ్‌ సెట్స్‌పై వచ్చింది. ఇటీవల షూటింగ్‌ ప్రారంభ వేడుకను ఘనంగా జరుపుకున్న ఈ మూవీ సోమవారం నుంచి హైదరాబాద్‌లో రెగ్యూలర్‌ షూటింగ్‌ జరపుకోనున్నట్లు నిహారిక ఎంటటైన్‌మెంట్ ట్విటర్‌ వేదికగా ప్రకటించింది. అనిల్ రావిపూడి  దర్శకత్వంలో  నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్‌పై వెంకట్ ఎస్ బోయినపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ‘రాయ్‌ స్టార్ట్స్‌ రోల్‌’ అంటూ షేర్‌ చేసిన ఈ ట్వీట్‌లో ఓ వ్యక్తి కుర్చీలో కుర్చుని అటూవైపు చూస్తున్నట్లు కనిపించగా టెబుల్‌పై ఓ టీ కప్పు, డైరీ ఉంది. దీంతో ఇది చూసిన నెటిజన్‌లు సెట్స్‌లో నాని అయింటాడని అభిప్రాయం వ్యక్తం చేస్తు కామెంట్‌ చేస్తున్నారు. కోల్‌కతా బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కస్తున్న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌, కాన్సెప్ట్ పోస్టర్‌ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాలో నాని సరసన సాయిపల్లవి, కృతిశెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. మిక్కీ జే మేయర్  సంగీతాన్ని అందిస్తున్నారు. మడోన్నా సెబాస్టియన్, రాహుల్ ర

MLA RK Roja Given Special Gift To CM YS Jagan On His Birthday | Roja Adopt A Girl

Image
  జగనన్నకు పుట్టినరోజు బహుమతి ఇదే: ఆర్‌కే రోజా RK Roja ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  పుట్టినరోజు సందర్భంగా నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా ఓ మంచి పనికి శ్రీకారం చుట్టారు. విద్యకు పెద్ద పీట వేస్తూ ఎంతోమంది చిన్నారులకు మేనమామగా మారిన వైఎస్‌ జగన్‌కు పుట్టినరోజు బహుమతి అందజేశారు.  ఈ మేరకు బాల్యంలోనే తల్లిదండ్రులు చనిపోయిన పి. పుష్పకుమారి అనే చిన్నారిని ఎమ్మెల్యే  రోజా   దత్తత తీసుకున్నారు. ప్రస్తుతం ఆ బాలిక తిరుపతిలోని గర్ల్స్ హోమ్‌లో చదువుకుంటోంది. పుష్ప కుమారికి మెడిసిన్ చేయాలనే లక్ష్యం ఉందని గర్ల్స్ హోమ్ నిర్వాహకులు రోజా దృష్టికి తీసుకొచ్చారు. మెడిసిన్ చదవాలని ఎమ్మెల్యే రోజాతో తెలిపిన విద్యార్థిని పుష్పకుమారి. పుష్ప కుమారి మెడిసిన్ చదువులకయ్యే ఖర్చుతో పాటు భవిష్యత్తు చదువులకు అయ్యే ఖర్చును తాను భరిస్తానని ఎమ్మెల్యే రోజా తెలిపారు. పుష్పను దత్తత తీసుకుంటున్నాని మాటిచ్చారు. ఈ సందర్భంగా ఆర్‌కే రోజా మాట్లాడుతూ.. ‘మంచి మనిషి జన్మదినాన ఒక మంచి పని..! మన అందరి ప్రియతమ నేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్‌ జగన్‌ అన్న పుట్టినరోజు సందర్భంగా ఒక మంచి పనికి శ్రీకారం చుట్టడం జర

corona vaccine Pfizer: Pfizer Vaccine May Not Procure Central Govt Due To High cost & Storage Problems

Image
  ఫైజర్‌ వ్యాక్సిన్‌కు కేంద్రం నో! కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు తాజాగా అమెరికాలో సైతం వినియోగించనున్న ఫైజర్ వ్యాక్సిన్‌ కు దేశీయంగా చుక్కెదురుకానుంది. ఫైజర్‌ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ ధర 37 డాలర్లు(సుమారు రూ. 2720) కావడం దీనికి కారణమని ఫార్మా వర్గాలు పేర్కొన్నాయి. మరోపక్క బ్రిటిష్ దిగ్గజం ఆస్ట్రాజెనెకా రూపొందించిన వ్యాక్సిన్‌ 10 డాలర్ల(రూ. 737)కే అందుబాటులోకి రానుండటంతో కేంద్ర ప్రభుత్వం ఫైజర్‌ వ్యాక్సిన్‌ కొనుగోలుకి ముందుకెళ్లకపోవచ్చని తెలియజేశాయి. అధిక ధరకుతోడు.. ఫైజర్‌ తయారీ వ్యాక్సిన్‌ను మైనస్‌ 70-90 సెల్షియస్‌లో నిల్వ చేయవలసి రావడం సైతం ప్రతికూలంగా పరిణమించనున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. వెరసి ఫైజర్‌ వ్యాక్సిన్‌ ధర, నిల్వ సమస్యలు, పంపిణీ వ్యయాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొనుగోలుకి విముఖత చూపనున్నట్లు ఫార్మా వర్గాలు అభిప్రాయపడ్డాయి. నాలుగో దేశం ఇప్పటికే ఫైజర్‌ వ్యాక్సిన్ ‌ను యూకే, బెహ్రయిన్‌, కెనడా అత్యవసర ప్రాతిపదికన వినియోగించేందుకు అనుమతులు మంజూరు చేశాయి. ఈ బాటలో వారాంతాన యూఎస్‌ఎఫ్‌ఎడీఏ సైతం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో నేటి నుంచి యూఎస్‌లోనూ ఫైజర్‌ వ్యాక్సిన్‌ను ఎ

Corona Cases Decline in India | Reason Behind Corona Cases Decline In India

Image
  అందుకే భారత్‌లో కరోనా ఉధృతి తగ్గుముఖం దేశంలో  కరోనా  పాక్షిక సామూహిక రోగ నిరోధక శక్తి (పార్షియల్‌ హెర్డ్‌ ఇమ్యూనిటీ) వచ్చిందా..? అందువల్లే కరోనా వ్యాప్తి, దాని ఉధృతి తగ్గుముఖం పట్టిందా..? అంటే అవుననే అంటున్నాయి వైద్య వర్గాలు.. దేశంలో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య తగ్గింది. ఆసుపత్రులకు వెళ్లేవారి సంఖ్యా అదే స్థాయిలో తగ్గింది. దాదాపు 90 శాతం కరోనా పడకలు ఖాళీగా ఉంటున్నాయి. ఇది మంచి పరిణామం.. ఈ పాక్షిక సామూహిక రోగనిరోధక శక్తికి తోడు, అవసరమైన వారికి వ్యాక్సిన్‌ ఇచ్చినట్లయితే పూర్తి స్థాయి హెర్డ్‌ ఇమ్యూనిటీ వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒకవేళ సెకండ్‌ వేవ్‌ వచి్చనా మనపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని చెబుతున్నారు. మే నెలతో పోలిస్తే ఆగస్టు నాటికి దేశంలో పది రెట్ల కేసులు పెరిగాయి. జనాభాలో ఎక్కువ మందికి కోవిడ్‌ సోకింది. అందువల్ల సామూహిక రోగనిరోధక శక్తి పాక్షికంగా వచ్చిందని అంటున్నారు దేశంలో ఆగస్టు నాటికే 7 శాతం మందికి కరోనా సోకిందని ఐసీఎంఆర్‌ వెల్లడించింది. పదేళ్లు పైబడిన 7.43 కోట్ల భారతీయులకు ఈ ఏడాది ఆగస్టు నాటికే వైరస్‌ సోకిందని సీరో సర్వేలో వెల్లడించింది. రోగ నిర

Cognizant Campus Recruitment 2021: Cognizant May Hire 2300 Campus Recruitment's In India

Image
  23,000 క్యాంపస్‌ ఉద్యోగాలకు రెడీ వచ్చే ఏడాది అంటే 2021లో 23,000 మందిని క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ ద్వారా ఎంపిక చేసుకోవాలని భావిస్తున్నట్లు కాగ్నిజెంట్‌ టెక్నాలజీస్‌ తెలియజేసింది. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో అధిక శాతం భారత్‌కే అవకాశముంటుందని కాగ్నిజెంట్‌ ఇండియా ఎండీ రాజేష్‌ నంబియార్‌ తాజాగా పేర్కొన్నారు. అక్టోబర్‌లో కాగ్నిజెంట్‌ బోర్డు సభ్యులైన నంబియార్‌ సీఈవో బ్రియాన్‌ హంఫ్రీస్‌ నిర్దేశనలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ ద్వారా సుమారు 17,000 మందిని ఎంపిక చేసుకున్నట్లు నంబియార్‌ తెలియజేశారు. 2016 నుంచీ చూస్తే ఇవి అత్యధికంకాగా.. వీటిలో సింహభాగం భారత్‌ నుంచే ఎంపికలు జరిగినట్లు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. పలు బాధ్యతలు కాగ్నిజెంట్‌ తరఫున దేశీయంగా 2 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిని పర్యవేక్షించే ఎగ్జిక్యూటివ్‌ కమిటీకి సైతం నంబియార్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.  కాగా.. దేశీ ప్రభుత్వ ఏజెన్సీలు, పాలసీ సంస్థలతో కాగ్నిజెంట్‌కున్న ఒప్పందాలను మరింత మెరుగు పరచవలసిన బాధ్యత నంబియార్‌పై ఉన్నట్లు పరిశ్రమ నిపుణులు ఈ సందర్భంగా తెలియజేశారు. దేశీయంగా కంపెనీ కార్యకలా

కోవిడ్‌ సెంటర్లో పెళ్లి.. వీడియో వైరల్‌

Image
  జైపూర్‌:   కరోనా  మహమ్మారి కారణంగా ఈ ఏడాది ఎన్నో పెళ్లిల్లు ఆగిపోయాయి. కోవిడ్‌ కారణంగా సామాన్యులు పెళ్లి ఆలోచన మానేస్తే.. సెలబ్రిటీలు మాత్రం పెళ్లి పీటలేక్కారు. ఇక మహమ్మారి విజృంభణ కాలంలో వివాహం చేసుకున్న వారు కోవిడ్‌ నియమాలను పాటిస్తూ.. పెళ్లి తంతు ముగించారు. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది.  కోవిడ్ ‌ కేర్‌ సెంటర్‌లో.. పీపీఈ కిట్లు ధరించి.. చేసుకున్న ఓ పెళ్లికి సంబంధించిన వీడియో నెటిజనులను ఆకట్టుకుంటుంది. రాజస్తాన్‌ కెల్వారా కోవిడ్‌ కేర్‌ సెంటర్‌లో ఈ వివాహ వేడుకు చోటు చేసుకుంది. వివరాలు.. రాజస్తాన్‌కు చెందిన ఓ యువతికి కొద్ది రోజుల క్రితం వివాహం నిశ్చయమయ్యింది. తీరా పెళ్లి ముహుర్తం సమీపించాక ఆమెకి కోవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. దాంతో కరోనా కేర్‌ సెంటర్‌లో జాయిన్‌ చేశారు. విషయం తెలుసుకున్న వరుడు.. పెళ్లిని వాయిదా వేయడం ఇష్టం లేక ముందుగా అనుకున్న ముహుర్తానికే యువతి మెడలో మూడు ముళ్లు వేశాడు వధువు, వరుడు, పూజారితో పాటు మరోక వ్యక్తి ఈ వివాహానికి హాజరయ్యారు. ఇక వధువుకు కరోనా సోకడంతో ఆమెతో పాటు,  పెళ్లి   కుమారుడి, పూజారి, మరో వ్యక్తి నలుగురు పీపీఈ కిట్లు ధరించారు

బాధితులకు సీఎం వైఎస్‌ జగన్‌ పరామర్శ

Image
  ముఖ్యమంత్రి   వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి   పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చేరుకున్నారు. హెలీప్యాడ్‌ నుంచి నేరుగా ఏలూరు ప్రభుత్వాసుపత్రికి బయల్దేరారు. అస్వస్థతకు గురై ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సీఎం పరామర్శించనున్నారు. సీఎం జగన్‌ వెంట మంత్రి పేర్ని నాని, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఉన్నారు.  బాధితుల పరామర్శ అనంతరం జడ్పీ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం దేవరపల్లికి చేరుకొని గోపాలపురం ఎమ్మెల్యే తల్లారి వెంకట్రావు కుమార్తె వివాహ రిసెప్షన్‌కు సీఎం జగన్‌ హాజరుకానున్నారు. కాగా, ఏలూరులో పలువురు అస్వస్థతకు గురైన విషయం తెలియగానే సీఎం జగన్‌ ఆదివారం ఉదయం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనానితో మాట్లాడారు. తక్షణం తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధితులను స్వయంగా పరామర్శించడమే కాకుండా వారికి అందుతున్న చికిత్సను పర్యవేక్షించాలన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో మంత్రి నాని  ఆదివారం  ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో బాధితులను పరామర్శించడమే కాకుండా వైద్యపరంగా తీసుకోవాల్సిన చర్యలను అధికారులతో స్వయంగా పర్యవేక్షించారు. సీఎం ఆదేశాలతో వైద్య ఆరోగ్యశాఖక

ప్రమాదంలో ప్రమాదం : షాకింగ్‌ వీడియో

Image
ఓ కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందగా.. ఆ ప్రమాదాన్ని చూడటానికి వచ్చిన వారిపైకి డీసీఎం దూసుకురావడంతో మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు. సీఐ సహా 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన శుక్రవారం సిద్దిపేట శివారులోని రాజీవ్‌ రహదారిపై చోటు చేసుకుంది. పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డేవిస్‌ కథనం ప్రకారం .. హుజురాబాద్‌లో నివాసం ఉండే బయ్యారం నరేందర్‌రెడ్డి వైద్యసేవల కోసం తన తల్లిదండ్రులతో కలసి శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు కారులో బయలుదేరారు. సిద్దిపేట శివారులోకి రాగానే కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న నరేందర్‌రెడ్డి (39), ఆయన తల్లిదండ్రులు రాజిరెడ్డి (70), విజయ (65) అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న సిద్దిపేట టూటౌన్‌ సీఐ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పరిశీలిస్తున్నారు. అలాగే.. చుట్టు పక్కల వారు కూడా ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. అంతలోనే కరీంనగర్‌ నుంచి వేగంగా వస్తున్న డీసీఎం (ఏపీ 03యూ2439) ఓ కారును ఓవర్‌టేక్‌ చేస్తూ.. ప్రమాదాన్ని పరిశీలిస్తున్న గుంపుపైకి దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాల పాలైన సిద

ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

Image
  సాక్షి, తూర్పుగోదావరి:    జిల్లాలోని కోటిపల్లి- యనాం ఏటిగట్టు రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. పి గన్నవరం మండలం కోట గ్రామం వద్ద కారు చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. మృతులను రిటైర్డ్ టీచర్ సత్యనారాయణ, ఆయన భార్య , రిటైర్డ్ లెక్చరర్ విజయలక్ష్మి, కుమారుడు ప్రణీత్‌గా గుర్తించారు. కాకినాడ నుంచి యానాం వస్తుండగా తెల్లవారుజామున ఘటన చోటుచేసుకుంది. అతివేగమే ప్రమాదానికి కారణమైనట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.