Thapsigargin Covid Treatment, New Medicine For Corona Virus

 

కరోనాకు కొత్త మందు! 




కోవిడ్‌–19 చికిత్సకు మరో కొత్త మార్గం అందుబాటులోకి వచ్చింది. థాప్సీగార్గిన్‌ అనే యాంటీ వైరల్‌ డ్రగ్‌ కోవిడ్‌–19 వైరస్‌పై సమర్థంగా పని చేయగలదని బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ నాటింగ్‌హామ్‌ శాస్త్రవేత్తలు గుర్తించారు. సాధారణ జలుబు, రెస్పిరేటరీ సిన్సీషియల్‌ వైరస్, ఇన్‌ఫ్లుయెంజా–‘ఎ’వైరస్‌లపై ఈ మందు ప్రభావం చూపగలదు. ఊపిరితిత్తుల సమస్యలు సృష్టించే కరోనా, ఇతర వైరస్‌లపై ఒకేసారి సమర్థంగా పనిచేసే మందు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో నాటింగ్‌హామ్‌ యూనివర్సిటీతో పాటు చైనా వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని యానిమల్‌ అండ్‌ ప్లాంట్‌ హెల్త్‌ ఏజెన్సీ, ఇంగ్లండ్‌లోని పిర్‌బ్రైట్‌ ఇన్‌స్టిట్యూట్‌లు సంయుక్తంగా పరిశోధనలు చేపట్టాయి.

Comments

Popular posts from this blog